చిన్నారి కీర్తికి కనకం కుటుంబం 20వేల రూపాయల ఆర్థిక సహాయం

పెద్దపెల్లి,ఐఏషియ న్యూస్: కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు అంబేద్కరిస్టు సామాజిక కార్యకర్త కీర్తిశేషులు కనకం విజయ్ పెద్దపెల్లి జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందినవారు. గత రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ సభ్యుల నుండి సేకరించిన 20వేల రూపాయలను కనకం విజయ్ కూతురు బేబీ కనకం కీర్తికిఅందజేసినారు. కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం రమణ ఉపాధ్యక్షులు కనకం సమ్మయ్య చేతుల మీదుగా సుల్తానాబాద్ కే డి సి సి బ్యాంకులో కీర్తి పేరు మీద 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ పత్రాన్ని శ్రీమతి కనకం శ్వేత కనకం కళ్యాణ్ కనకం కీర్తికి అందజేసినారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *