వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. స్వయంగా స్వదేశాలకు వెళ్లేవారికి ఇప్పటికే నగదు ఆఫర్ చేసింది. అయితే క్రిస్మస్,న్యూఇయర్ సందర్భంగా అక్రమవలసదారులకు మరో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ఏకంగా 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ లోపు అమెరికాను విడిచి వెళ్లేవారికి 3 వేల డాలర్లు అంటే మన …
Read More »admin
సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరళ్లను నియమించింది. దవీందర్‌పాల్ సింగ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్స్‌గా నియమించింది.ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ పదవిలో కనకమేడల రవీంద్ర కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో తెలుగుదేశం …
Read More »రోడ్డుపక్కన వానరాల కళేబరాలు: కడప జిల్లాలో దారుణం
కడప,ఐఏషియ న్యూస్: కడప జిల్లాలో దారుణం జరిగింది. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో మంగళవారం సాయంత్రం వానరాలను చంపి, వాహనంలో తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్లడం కలకలం రేపింది. పశువులను మేపడానికి వెళ్లిన కాపర్లు రోడ్డు పక్కన 21 వానరాలు చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఈ ఘటనపై బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. కప్పలపల్లి …
Read More »టోకెన్ ఉన్న భక్తులకే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈనెల 30 నుంచి జనవరి 1 వరకు కేవలం టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం కల్పించడం జరిగిందని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు మీడియాకుతెలియజేశారు.జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని, టోకెన్ లేని వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ముందస్తు సమాచారం ఇస్తున్నామని ఆయన …
Read More »ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్లకు మంచి స్పందన వస్తోంది. ఈ క్యాంటీన్లను జనవరి 13నుంచి15మధ్యక్యాంటీన్లుప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం …
Read More »ఉపాధి హామీ పథకం కొత్త చట్టంపై 26న గ్రామసభలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్-గ్యారంటీ ఫర్ రోజ్ర్, ఆజీ వికా మిషన్ పై ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.చట్టంలోని కీలక నిబంధనలు, చట్టబద్ధ హక్కులపై శ్రామికులు, ప్రజలకు గ్రామసభల్లో అవగాహన కల్పించడంతో పాటు చర్చించనున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. Authored by: Vaddadi udayakumar
Read More »30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్.
నంద్యాల,ఐఏషియ న్యూస్: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ అధికారిగా శ్యామ్ రాజు ఏడాది జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి ఖజానా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 45వేలు రూపాయలు డిమాండ్ చేయగా 30వేలు రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. శ్యామ్ రాజు ఫిర్యాదిదారుడు మేరకు ఏసీబీ …
Read More »సైబర్ ఫ్రాడ్‌కు బలైన పంజాబ్ మాజీ ఐజీ.. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య
భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు పోగొట్టుకున్న అమర్ సింగ్ చాహల్ 12 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పాటియాలా,ఐఏషియ న్యూస్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ కన్నుమూశారు. భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు నష్టపోయిన ఆయన తీవ్ర మనస్తాపంతో సోమవారం తననివాసంలోతుపాకీతోకాల్చుకున్నారు. డైలి జాగరణ్ కథనం ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ …
Read More »భారత నిపుణులకు అమెరికా గట్టి దెబ్బ
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుతో పెరుగుతున్న అనిశ్చితి భారత ఐటీ నిపుణులు, వైద్యులపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: హెచ్-1బీ,హె-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది.ప్రామాణిక వీసా స్క్రీనింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలనను అన్ని హెచ్-1బీ,హె-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఈ నెల 15 నుంచి ఈ కొత్త విధానం …
Read More »పూర్ణమార్కెట్ లో అగ్నిప్రమాదం: పలు పూజ సామాగ్రి దుకాణాలు దగ్ధం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ పూర్ణమార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు వలన మార్కెట్ ఉన్న ఆరు పూజ సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలని అదుపు చేశారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వన్ టౌన్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆస్తినష్టం ఎంత జరిగిందన్నది తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News