మార్టేరు (పశ్చిమగోదావరి జిల్లా),ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటుడు జోష్ రవికు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో మూడో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు వెంటనే ఇంటికి వెళ్లే లోపు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మార్టేరు గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది.గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి నాని పంతులు అర్చక సేవలు …
Read More »Uncategorized
3వ రోజుకు చేరిన “టిట్టిభ సత్యాగ్రహం”
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగుభాష రక్షణ కోసం తెలుగుదండు చేపట్టిన “టిట్టిభ సత్యాగ్రహం” మూడవ రోజు కూడా విజయవంతంగా జరిగింది. అనుకోని అతిథులుగా విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని నింపారు.దీక్షా వేదికపై తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ..ఓ పెద్దయ్యా పెద్దలు అంత పెద్దగా రావటంలేదని నువ్వంత పెద్దగా బెంగపడొద్దు. మేము లేమూ..మరిచిపోయారా? మన భాషను, మన సంస్కృతిని గట్టిగా కాపాడుకొందాం. మీరు అస్సలు తగ్గకండి అంటూ..మద్దతు పలికి, నాలో నమ్మకాన్ని నింపిన.. ఈ తెలుగు తల్లులకు కొద్దిగా సిగ్గుపడుతూ.కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చమత్కరించారు.సత్యాగ్రహ …
Read More »20వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన వీఆర్వో సూర్యనారాయణ
దేవరాపల్లి,ఐఏషియ న్యూస్: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్.అమ్మతల్లినాయుడు బావకు చెందిన వ్యవసాయ భూమిని రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, ఈ-పాస్ బుక్ ఇచ్చినందుకు గాను అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం,యం. అలమండ గ్రామ సచివాలయంలో గ్రామ రెవిన్యూ అధికారిగా పనిచేయుచున్న చుక్క సూర్యనారాయణ సదరు యస్.అమ్మతల్లి నాయుడు వద్దనుండి రూ. 20వేలు లంచంగా డిమాండు చేసినారు. అయితే సదరు యస్. అమ్మతల్లి నాయుడుకు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టంలేక, సదరు గ్రామ రెవిన్యూ అధికారిపై విశాఖ ఎ.సి.బి …
Read More »రేషన్ కార్డుదారులకు షాక్: ఈనెల 30 వరకే ఛాన్స్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త స్మార్ట్ కార్డులను మూడు నెలల క్రితం జారీ చేసింది. గ్రామ సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డుల పంపిణీ జరుగుతోంది.అయితే మూడు నెలలు గడిచినా వేలాది కార్డులను లబ్ధిదారుల తీసుకోలేదు. ప్రధానంగా వలస వెళ్లిన లబ్ధిదారులకు కార్డులు తీసుకోవడం కష్టంగా మారింది. అలాగే మరికొందరు కూడా కార్డులు తీసుకోలేదు. దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండానే ఉండిపోయాయి. ముఖ్యంగాఅనకాపల్లి మండలంలో అత్యధికంగా 4,220మంది లబ్ధిదారులు కార్డులు తీసుకోలేదని …
Read More »35వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసిల్దార్ సునీల్ రాజు
ధోన్( కర్నూలు),ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లా ధోన్ మండలంగుంటుపల్లి గ్రామానికి చెందిన దామ వేణుగోపాల్ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు ధోన్ తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు, జగదుర్తి గ్రామంలోని “డాటెడ్ ల్యాండ్” ను “పట్టా భూమి”గా మార్చడానికి 35వేలు లంచం డిమాండ్ చేసి నాడని, ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం మేరకు ధోన్ తహసీల్దార్ కార్యాలయంపై దాడి నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ సునీల్రాజు లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచంగా …
Read More »రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పురోగతి బాట పట్టించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కొత్త విధానం: సీఎం చంద్రబాబు రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం,అనకాపల్లి తదితర …
Read More »ఢిల్లీలో భారీ పేలుళ్లు 13 మంది దుర్మరణం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. నగరంలో అకస్మాత్తుగా నెలకొన్న ఈ హైటెన్షన్ వాతావరణం పౌరులను భయాందోళనలకు గురిచేసింది. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో, చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో పేలుడు సంభవించింది. బ్లాస్ట్ తీవ్రతకు ఆ చుట్టుపక్కల నిలిపి ఉంచిన ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మంటలు చుట్టుపక్కలకూ వ్యాపించాయి.ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన …
Read More »ఢిల్లీలో పేలుడు ఘటన.. అలర్ట్ అయిన ఏపీ పోలీసులు
అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో పేలుడు ఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పోలీసులు పలు చోట్ల వాహనాల విస్తృత తనిఖీలుచేస్తున్నారువిజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో తనిఖీలు చేపట్టారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.కొత్తగా సీటిలోకి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులుఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, డీఐజీలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్) …
Read More »కన్నకొడుకును హతమార్చిన తండ్రి
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: మద్యానికి బానిసైన కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు హతమార్చాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో ఈనెల ఆరవ తేదీన మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును కర్రతో బలంగా తలపై కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఆ మరుసటి రోజు జోడిగుడ్లపాలెం స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు.మృతుడు ప్రసాదుకు 2019లో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్యవై.రాజీవిజయవాడలోనివసిస్తున్నారు.విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు …
Read More »
News Website (iasianews.net) I Asia News