సింహాచలం దేవస్థానంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

సింహాచలం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం,సింహాచలంలో విస్తృత స్థాయిలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.భక్తులకు అత్యంత పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.సుజాత ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం శ్రద్ధగా అమలు చేయబడింది. డిప్యూటీ ఈ.ఓ. సింగం రాధ, సహాయ కార్యనిర్వహణాధికారులు కె.తిరుమలేశ్వరావు, వాడ్రేవు రమణమూర్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించారు.శానిటేషన్ సిబ్బంది ఇతర విభాగాల ఉద్యోగులతో కలిసి, ముఖ్య ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేశారు.రాజగోపురం ఎదుటి ప్రాంగణం సింహగిరి పరిసర ప్రాంతాలు యాత్రికులు అధికంగా సంచరించే ఈ ప్రాంతాలన్నింటినీ పరిశుభ్రపరిచి, దేవస్థానం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి శుభ్రత కార్యక్రమం విజయవంతమైన అనంతరం,ఆలయ ప్రాంగణంలో పాల్గొన్న ఉద్యోగులందరితో “స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ”చేశారు. శానిటేషన్ విభాగం ఏఈఓ పంతం శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారులు కంచి మూర్తి రమణ, జోగారావు, వాసు, పి.ఆర్.ఓ నాయుడు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ధ్వజ స్తంభాలు,రథాలు తయారీకి 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఏర్పాటైన ఈ సమావేశానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *