విజయనగరం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టు గుర్తింపు పూర్తయ్యింది. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో సాక్షాత్కరించినట్లు పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు వెళ్లడించారు.దీంతో ఈ గ్రామానికి చెందిన చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ కల్లాల్లో సిరిమాను, లోకవరపు సత్యం కల్లంలో ఇరుసుమానును గుర్తించారు.అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు బుధవారం వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య సంప్రదాయబధ్దంగా పూజలు నిర్వహించి, బొట్టు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులనాయుడు, ఆలయ సహాయ కమిషనర్ కె.శిరీష, పూజారివెంకటరావు,స్థానికప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News