పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక మృతి

అనంతగిరి,ఐఏషియ న్యూస్: పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక చనిపోయిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు. ప్రకారం.మండలంలోని మంగళవారం చెరుకుమడత పరిసర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడింది.ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బట్నాయిని కీర్తి(16) పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే ఆ బాలిక మృతి చెందింది.కీర్తి మృతితోచెరుకుమడతలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రభుత్వ అధికారులేగుర్తించిబాలికనుకోల్పోయినతల్లిదండ్రులను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *