అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంకులు విలీనం చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు పాటు గ్రామీణ బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు గ్రామీణ బ్యాంక్ యాజమాన్యం గురువారం ఒక పర్యటన జారీ చేశారు.ఒకే గొడుగు కిందకు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు తీసుకురానున్నారు. విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం కలుగుతుంది.
ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు నిలిచిపోతాయి.ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా పనిచేయవని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యాజమాన్యం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు తమకు సహకరించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar
Check Also
విద్యుత్ శాఖకు తెలంగాణ “గీతం యూనివర్సిటీ” 118 కోట్లు బకాయిలు
విద్యుత్ బిల్లు బకాయిలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం విద్యుత్ శాఖ ఎస్ ఈ కోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశం …
News Website (iasianews.net) I Asia News