కర్నూల్ బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుర్లు దుర్మరణం

మస్కట్ లో విషాదఛాయలు

మస్కట్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఎన్నో ఆశలు , ఎన్నో ఊహలతో బతుకుతాము ,, అన్నీ మధ్యలోనే అడియాసలు అవుతాయి , బహుశా ఆ శివయ్య ఆట అంతేనేమో.అజాత శత్రువులుగా రెండు దశాబ్ధలకు పైగా మస్కట్ లో మా అందరిమధ్య ఉండి భర్త ఆనంద్ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగము చేసుకుంటూ కొడుకు కూతురులను మంచిగా చదివించి ఇండియాలో ఇంజనీరింగ్ అయ్యాక అమ్మాయి చందనను బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగమునకు పెట్టి ఇటీవల దీపావళి సెలవులకు హైదరాబాద్ వెళ్లి కూతురును బెంగుళూర్ నుంచి తెచ్చి సెలవులు అయ్యాక కూతురు చందన ను తిరిగి బెంగుళూర్ వదిలేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన సంధ్య. శుక్రవారం తెల్లవారి జామున కర్నూలు వద్ద జరిగిన అనుకోని బస్సు దగ్ధం దుర్ఘటనలో కూతురు చందనతో పాటు మంటల్లో కాలి పోవడము,ఆనంద్ కు తీరని శోకము కలిగించింది.క్షణకాలములో ఆశలు, ఊహలు బస్సు మంటల్లో కాలిపోవడము.
ఏమని చెప్పాలి?
తెలుగు కార్యక్రమాల్లో ఎంతో హుషారు గా పాల్గొని , అందరిని మంచిగా పలకరించే సోదరి సంధ్య మరి లేదన్న వార్త మస్కట్ తెలుగు సమాజానికి తీవ్ర దిగ్బ్రాంతి మరియు శోకతప్తము అని చెప్పక తప్పదు .తల్లీ కూతుర్ల ఆత్మకు శాంతి చేకూరాలని మనసుపూర్తిగా ప్రార్ధిస్తూ ఈ సమయములో మిత్రుడు ఆనంద్ కు కుమారుడు వల్లబ్ కు ప్రగాఢ సానుభూతి తెల్పుతూ మీ ఈ కష్ట సమయములో వారికి ఆత్మ స్టయిర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మస్కట్ తెలుగు సంఘ కుటుంబ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *