అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో నెలకొన్న తుఫాన్ ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగాచిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు,నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట,రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో ఫీల్డ్ విజిట్ చేసిన సీఎం.నేలకొరిగిన వరి పొలాల పరిశీలించారు.తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం అన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేశారని సీఎం చంద్రబాబు అభినందించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News