ముంబయి,ఐఏషియ న్యూస్: మ్యాన్ ఆఫ్ హిందీ సినిమాగా ప్రసిద్ధి పొందిన హీరో ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ‘‘ధర్మేంద్ర అస్తమయంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళులర్పించారు.
కొన్నిరోజుల కిందట ధర్మేంద్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబయిలోని బీచ్‌కాండీ ఆస్పత్రిలో చేారారు. అయితే చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ ధర్మేంద్ర మృతి చెందారు.నిజ జీవితానికి వస్తే రచయిత, ప్రేమికుడు, తండ్రి, ప్రపంచంలోని అందగాళ్లలో ఒకరు, తాగుడు అలవాటును అధిగమించిన వ్యక్తి, రాజకీయ నాయకుడు కూడా ఆరు దశాబ్ధాలు వివిధ పాత్రలు పోషించి దేశ విదేశాల్లో కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News