Recent Posts

అమెరికాలో ఏపీ యువతీ అనారోగ్యంతో మృతి

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఆ యువతిని అనారోగ్యం కబలించింది. యువతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి లేదన్న వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి(23) విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఇటీవల …

Read More »

పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పాకిస్తాన్ తో సంబంధాలకు సంబంధించి విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల 10 నెలల జైలు శిక్షను,ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.దీనితో ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎన్‌ఐఏ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

అనంత్ నాగ్ లో పక్షి ఢీకొనడంతో లోకో పైలట్ కు గాయాలు: ప్రయాణికులందరూ సురక్షితం

అనంత్ నాగ్,ఐఏషియ న్యూస్: బిజ్బెహారా-అనంత్ నాగ్ మధ్య శనివారం ఉదయం లోకోమోటివ్ అద్దంను డేగ ఢీకొనడంతో రైలు పైలట్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన పైలట్ శ్రీ విశాల్ కు అనంత్ నాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.తనిఖీ కోసం రైలును కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »