Recent Posts

శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన శ్రావణలక్ష్మి పూజలు

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో నెలరోజులు పాటు ఘనంగా నిర్వహించిన శ్రావణ లక్ష్మి పూజలు శనివారం నిర్వహించిన మహా పూర్ణహుతితో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే. శోభరాణి, వేద పండితులు,అర్చకులు,ఉభయదాతలు, సిబ్బంది పాల్గొన్నారు.  Authored by: Vaddadi udayakumar

Read More »

మూడు నెలల్లోగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి అమరావతి,ఐఏషియ న్యూస్:  ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిల పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉద్యోగులు, పెన్షర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని,12వ పిఆర్సీ కమీషన్ తక్షణమే నియమించాలని కోరుతున్నాయి. తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు. మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు …

Read More »

ఏపీ డీజీపీకి మానవహక్కుల సంఘం నోటీసులు

తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంలో ఘటనపై నోటీసులు వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు అమరావతి,ఐఏషియ న్యూస్: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్‌లో జరిగిన హింసపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశారని,నిందితుల పేర్లతో …

Read More »