స్వర్ణముఖి నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం అగ్రహారం గ్రామానికి చెందిన 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం జరిగిందని,ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి నలుగురు యువకులు కొట్టుకుపోయారని తెలిపారు. ముగ్గురు మాత్రం స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత శాఖలకు అప్రమత్తం అవ్వాలని, గల్లంతైన విద్యార్థుల కోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గల్లంతైన యువకులు ప్రకాశ్ (17), చిన్న (15), తేజు (19), బాలు (16)గా గుర్తించారని,రక్షణ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించగా, బాలు అనే యువకుడి మృతదేహం బయటపడింది.మిగిలిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.జిల్లా పోలీసులు, రెవెన్యూ, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, బృందాలు, సిబ్బంది సంయుక్తంగా రక్షణ చర్యల్లో పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *