విజయవాడ-బెంగళూరుకు వందే భారత్

తిరుపతి ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న ఇండియన్ రైల్వే ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఇచ్చి వరం ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త రైలును మంజూరు చేసింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఏపీకి కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్
రైల్వే శాఖ ఇటీవల ఏపీకి ఇచ్చిన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ మార్గాన్ని, షెడ్యూల్ ని ఖరారు చేసింది. నవంబర్ నెలాఖరుకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తామని సూచన ప్రాయంగా పేర్కొంది. విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లోనూ ప్రయాణికులకు తన సేవలను అందిస్తుంది. ఈ రైలు ద్వారా విజయవాడ నుండి బెంగళూరుకు 9 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రైల్వే స్లీపర్ ప్రయాణికులకు కూడా బెడ్ రోల్స్

అయితే ఉచితం కాదు రుసుము చెల్లించాలి ప్రయోగాత్మకంగా చెన్నై డివిజన్లో అమలు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రైల్వే స్లీపర్ క్లాస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *