ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్లు పెట్టుబడులు

సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సీఐఐ సదస్సులో భాగంగా విశాఖ నోవాటెల్ హోటల్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న 3 సంస్థలు ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో మారిటైమ్ రంగంలో దాదాపు 1,300 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం లభిస్తుంది.అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సులో పాల్గొనడం జరిగింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి విడుదల చేశారు. గ్లోబల్ ఎకనమిక్ హబ్ గా విశాఖ రీజియన్ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు విశాఖ ఎకనామిక్ రీజియన్ 2040 మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. విశాఖలో జరిగిన సదస్సులు, సమావేశాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, కొండపల్లి శ్రీనివాస్ , కందుల దుర్గేష్, వంగలపూడి అనిత , గుమ్మిడి సంధ్యారాణి , బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ జెడ్ శివప్రసాద్,సీఎస్ విజయానంద్, తదితరులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *