Recent Posts

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

శబరిమల,ఐఏషియ న్యూస్:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ నేతృత్వంలో గురువారం ఉదయం నుండి కిలిమనూరు సమీపంలోని ఉన్నికృష్ణన్ నివాసంలో దాదాపు 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ జరిపింది. అనంతరం,శుక్రవారం తెల్లవారుజామున అతని అరెస్టును …

Read More »

దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై విశాఖ నగర పోలీసుల మెరుపు దాడులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

కనకదుర్గ ఆలయ పాలకమండలి ధర్మకర్తగా పద్మావతి ప్రమాణస్వీకారం

విజయవాడ,ఐఏషియ న్యూస్: కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి పద్మావతి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.ఆలయ ఈవో వి. కె. శీనా నాయక్ మహా మంటపంలో గల కార్యాలయంలో పద్మావతి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,మాజీ శాసన సభ్యులు ఎస్. ఉదయభాను,ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవ రాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »