Recent Posts

డ్యూటీ లోనే గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

పెందుర్తి,ఐఏషియ న్యూస్: గుండెపోటుతో ఎస్.కోట ఏపీఎస్ఆర్టీ సీ డిపోకు చెందిన కండక్టర్ మంగళవారం మృతి చెందారు. ఎస్. కోట ఏపీఎస్ఆర్టీ డిపో సూపరిండెంట్ వెంకట్రావు తెలియజేసిన వివరాలు ప్రకారం విశాఖ నుంచి కించుమండ వెళుతున్న బస్సులో పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ సమీపంలో కండక్టర్ ఈశ్వరరావు తాను కూర్చున్న సీటులోనే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ప్రయాణికులు,డ్రైవర్ కండక్టర్ ఈశ్వరరావును పెందుర్తి ఆరోగ్య కేంద్రానికి  తరలించగా  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషాద ఛాయలు అలముకొన్నాయి. Authored by: Vaddadi udayakumar  

Read More »

ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి

సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళన కలిగిస్తోంది సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు హెచ్చరిక ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే ఏపీలో సిజేరియన్‌ ఆపరేషన్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వాటిలో 90 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించదని హెచ్చరించారు.సహజ …

Read More »

శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగరం పట్టణంలో అక్టోబరు 6, 7 తేదీల్లో జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి తోలెళ్లు, సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో క్యూలైన్ల ఏర్పాటు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి,, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంకు చేరుకొని, ముందుగా అమ్మవారిని దర్శించుకొని, భక్తుల దర్శనాలకు ఏర్పాటు చేయుచున్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం, ఆలయం పరిసర …

Read More »