
వివరాలు వెల్లడించిన ఈస్ట్ డివిజన్ ఎసిపి కె లక్ష్మణమూర్తి
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డివిజన్ ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి మాట్లాడుతూ 2020 జూలై 5వ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పల్లపు ప్రసాద్ భరత్ ను రామ్ రెడ్డి అలియాస్ ప్రతాపరెడ్డి బోయిన విష్ణు ఎండి లాయక్ కలిసి కిడ్నాప్ చేసి జామి సురేష్ ను ఐదు కోట్లు డిమాండ్ చేయగా చివరగా 70 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తన దగ్గర అంత డబ్బు లేదని సురేష్ తన భార్యకు ఫోన్ చేసి సైట్ విషయంలో లోన్ తీసుకోవాల్సి ఉందని ఇంటి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని సీతంపేట లో గల ఐ ఎఫ్ ఎల్ దగ్గరకు రమ్మని తెలిపారు. సురేష్ భార్య కుమారుడు ఈ విషయాన్ని 100 డైలీ తెలియజేయగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వీరంతా పరారిపోయారు. ఈ విషయంపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.నిందితులు పల్లపు ప్రసాదు ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అదే ఏడాది జులై 10వ తేదీన అరెస్టు చేసారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలు విష్ణు ఎండి నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టి స్పెషల్ టీం ను నియమించారు. విష్ణు కోసం వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ అత్తాపూర్ ఏరియాలో విష్ణును పట్టుకున్నారు. నాలుగో ముద్దాయి నాయక్ గురించి విచారించిన 2021లో ఇతను ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. కేసు విషయంపై ముద్దాయిలని పట్టుకోవడంలో నాలుగోపట్టణ పోలీసుల పని తీరును నగర పోలీస్ కమిషనర్,డీసీపీలు అభినందించినట్లు ఏసిపి లక్ష్మణ మూర్తి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఉమాకాంత్, ఎస్ ఐ లు వెంకట్రావు, బాలకృష్ణ, చిన్నమ్మ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News