అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ

అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాజధాని అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,618 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఫేజ్–1లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ‘కోడ్–4ఎఫ్’ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఎయిర్‌బస్ ఏ 380, బోయింగ్ 777–9 వంటి ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు కూడా అమరావతిలో ల్యాండింగ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన రవాణాలో కీలక కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.త్వరలోనే భూసేకరణ, టెండర్లు, నిర్మాణ పనులపై ప్రభుత్వ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *