విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం జరిగిన దోపిడీ కేసును విశాఖపట్నం సిటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, సెల్ టవర్ లొకేషన్‌లు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా సుమారు 300 కిలోమీటర్ల మేర నిందితుల కదలికలను ట్రాక్ చేసి రాజోలు వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, దొంగిలించిన సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.శ్రీమతి లతా మాధురి, డిసిపి క్రైమ్స్ వారి ఆదేశాల మేరకు ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిఐ వి. చక్రధర్ పర్యవేక్షణలో ఆరిలోవ పోలీసుస్టేషన్ క్రైమ్ ఎస్.ఐ ఏ.హరికృష్ణ, ఎంవిపి క్రైమ్ ఎస్.ఐ సిహెచ్. రామదాసు, ద్వారకా క్రైమ్ ఎస్.ఐ శ్రీనివాసరావు ద్వారకా సబ్-డివిజన్ సిబ్బంది, సిసిఎస్ ఇన్సపెక్టర్స్ రామారావు, చంద్రశేఖర్ వారి సిబ్బంది అందరు కొన్ని బృందాలుగా ఏర్పడి నిందితుల యొక్క వ్యూహలను చేదించి, సమగ్ర సమాచారాన్ని సేకరించి, పైన పేర్కొన్న నిందితులను గుర్తించి, వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి దొంగిలించిన సొత్తును, నేరమునకు వినియోగించిన ఐదు సెల్ ఫోన్ లను,పోలీస్ సొసైటీ స్వాదినము చేసుకొని, నేరస్తులను రిమాండ్ నకు పంపడమైనది. ఇంకా ఒక హోండా యాక్టివా స్కూటీ ని రికవరీ చేయవలసి ఉన్నది.ఈకేసును ఛేదించడంలో అద్భుతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని విశాఖపట్నం సిటీ పోలీసు కమీషనర్ డాక్టర్. శంకాబ్రతబాగ్చి అభినందనలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News