అరకు పర్యాటకులకు రైల్వే నూతన సంవత్సర కానుక

అరకులోయ,ఐఏషియ న్యూస్: శీతాకాలంలో అరకు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అటువంటి అరకు వెళ్లే పర్యాటకులు నూతన సంవత్సర వేడుకల వేళ కూడా అరకు అందాలను చూడడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త చెప్పింది.
విశాఖ కిరండోల్ రైలుకు అదనపు బోగీ ఏర్పాటు
పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్న రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. విశాఖపట్నం – కిరండోల్ మార్గంలో పెరుగుతున్న ప్రయాణికుల తాకిడి దృష్ట్యా విశాఖ కిరండోల్ రైలుకు అదనపు బోగీని ఏర్పాటు చేసింది. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకుల అధిక డిమాండ్ ఉండే రోజులలో ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని ఆదేశించారు.
జనవరి 20 వరకు అరకుకు వెళ్ళే రైలుకు అదనపు బోగీ
అరకు వెళ్లే రైలు కోసం రైల్వేస్టేషన్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో అరకు వెళ్లే ఏకైక రైలు కాస్త కిటకిటలాడుతూ కనిపిస్తున్న క్రమంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. డిసెంబర్ 29 నుండి జనవరి 20వ తేదీ వరకు రైలుకు అదనంగా ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోసం జత చేశారు.
పర్యాటకుల తాకిడితో రైల్వే శాఖ నిర్ణయం
తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30 నుండి జనవరి 21 వరకు అదనపు కోచ్ ను చేర్చారు. ఇక పర్యాటకుల రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైలును కూడా నడిపారు. ప్రకృతి అందాలను చూడడానికి పర్యాటకులు అరకుకు పోలోమంటూ వెళుతున్న క్రమంలో రైల్వే శాఖ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది.
అరకులోని ఘాట్ రోడ్లపైన ట్రాఫిక్ జామ్
మరోవైపు అరకులో పర్యాటకుల రద్దీ పెరగడంతో అరకులోని ఘాట్ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక పర్యాటకుల తాకిడి దృష్ట్యా కాఫీ తోటల సందర్శనను ఉదయం 11 గంటల వరకు, మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు.శీతాకాలంలో అరకులోని కాఫీ తోటలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే అరకులోని అందాలను చూడడానికి పర్యాటకులు పోటీ పడుతున్నారు.దీంతో అరకుకు పర్యటన తాకిడి బాగా ఎక్కువైందని చెప్పక తప్పదు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ద్రాక్షారామంలో అపచారం: శివలింగం ధ్వంసం చేసిన దుండగులు

ద్రాక్షారామం,ఐఏషియ న్యూస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం సప్తగోదావరి తీరాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *