Recent Posts

రైతులు ఆందోళన చెందవద్దు… రాష్ట్రంలో ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయి..

అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం వారం రోజుల్లో మ‌రింత యూరియా రాష్ట్రానికి చేరుకోనుంద‌ని వెల్ల‌డించిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజ‌య‌వాడ‌లోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా …

Read More »

భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.వీరితోపాటుమాజీ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

తిరుమల,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న నిర్మల సీతారామన్ కు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటోను అందజేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు …

Read More »