20వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన వీఆర్వో సూర్యనారాయణ

దేవరాపల్లి,ఐఏషియ న్యూస్: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్.అమ్మతల్లినాయుడు బావకు చెందిన వ్యవసాయ భూమిని రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, ఈ-పాస్ బుక్ ఇచ్చినందుకు గాను అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం,యం. అలమండ గ్రామ సచివాలయంలో గ్రామ రెవిన్యూ అధికారిగా పనిచేయుచున్న చుక్క సూర్యనారాయణ సదరు యస్.అమ్మతల్లి నాయుడు వద్దనుండి రూ. 20వేలు లంచంగా డిమాండు చేసినారు. అయితే సదరు యస్. అమ్మతల్లి నాయుడుకు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టంలేక, సదరు గ్రామ రెవిన్యూ అధికారిపై విశాఖ ఎ.సి.బి అధికారులకు ఫిర్యాదు చేసినాడు. విశాఖపట్నం ఎ.సి.బి అధికారులు, అతని ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి, సదరు గ్రామ రెవిన్యూ అధికారి, ఆ లంచం డబ్బులను, ఫిర్యాదు దారుడి వద్దనుండి మంగళవారం తీసుకొంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు.అరెస్టు కాబడిన వీఆర్వో సూర్యనారాయణను విశాఖ లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం హాజరు పరచనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైనా అవినీతి జరుగుచున్నట్లయితే, సదరు సమాచారాన్ని ఎవరైనా సంభందిత జిల్లా ఎ.సి.బి అధికారులకు కాని లేదా ఎ.సి.బి. టోల్ ఫ్రీ నెంబరు 1064 లేదా ఎ.సి.బి మొబైల్,నెం.9440440057 .complaints-acb@ap.gov.in తెలియపరచవచ్చునని అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *