విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: మద్యానికి బానిసైన కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు హతమార్చాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో ఈనెల ఆరవ తేదీన మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును కర్రతో బలంగా తలపై కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఆ మరుసటి రోజు జోడిగుడ్లపాలెం స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు.మృతుడు ప్రసాదుకు 2019లో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్యవై.రాజీవిజయవాడలోనివసిస్తున్నారు.విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేయగా నిందితుడు కన్న తండ్రి లక్ష్మణరావు గా పోలీసులు నిర్ధారించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News