ఏలూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్డు సమీపంలో, పెద్దగా జన సంచారం లేని అపార్ట్మెంట్ల సముదాయాల చివరలో ఆ ప్రాంతానికి చెందిన ఒకరి ఇంటిని గత 20 రోజుల క్రితం అద్దెకు తీసుకుని ప్లేస్మెంట్ సర్వీస్ అనే ఉద్యోగాల కల్పన పేరుతో కార్యకలాపాలు సాగించారు. పక్క సమాచారంతో ఈ ఇంటిలోఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన దాపు 15 మంది మావోయిస్టులను జిల్లా ఎస్పీ కే శివప్రతాప్ కిషోర్ సారధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. మావోయిస్టులను అదుపులోకి తీసుకొని జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. విజయవాడ నుండి అక్టోపస్ పోలీస్ బృందాలు ఉదయం 11:30 గంటలకు ఇచ్చిన సమాచారం మేరకు12,12:30 గంటల మధ్య ఇలా ఎస్పీ రంగంలోకి దిగి 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని గ్రీన్ సిటీలో, మరో ముగ్గురిని బయట అదుపులోకి తీసుకున్నారు.
ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ 15 మందిలో ఐదుగురు మహిళలు ఉండగా పదిమంది పురుషులు ఉన్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా?తల దాచుకునేందుకు వచ్చారా? అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News