డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.అందులో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు.మావోయిస్టుల నుంచి పోలీసులు 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ కాగా మిగతా వాళ్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలిపారు. కుమురం భీమ్‌ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఇద్దరు సెంట్రల్ విజన్‌ కమాండర్లు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు.మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని డీజీపీ తెలిపారు. తెలియని ప్రాంతాలకు వెళ్లడం, నిత్యావసర వస్తువులు సరైన సమయంలో అందకపోవడం, కీలక నాయకులే లొంగిపోతున్న నేపథ్యంలో కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారన్నారు.లొంగిపోయిన మావోయిస్టులు తీసుకొచ్చిన ఆయుధాల్లో ఒకటి ఎల్ఎంజీ, 3 ఏకే 47 రైఫిల్స్, 5 ఎస్ఎల్ఆర్ రెఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, 1 బీజేఎల్ గ్రానైడ్ లాంఛర్, నాలుగు 303 రైఫిల్స్, ఒకటి సింగిల్ షాట్ రైఫిల్స్, 2 ఎయిర్ గన్స్తో కలుపుకుని మొత్తం 24 ఆయుధాలతో లొంగిపోయారు. అక్టోబర్ 21న జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుమేరకువీళ్లుప్రభుత్వంముందులొంగిపోయారు.
కేంద్రం కూడా సాయం చేస్తుంది : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
ప్రభుత్వం లొంగిపోయిన వారికి క్యాడర్ ప్రకారం నగదు పరిహారం అందిస్తుందని,ఆయుధాలతో లొంగిపోయే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై రూ.1.46 కోట్లు కోట్ల రివార్డు ఉందన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందించినట్లు తెలిపారు.ఏ రాష్ట్రాలకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తామని అన్నారు.
తెలంగాణ వాళ్లు 54 మంది
ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు ఉన్నారని,వీరిలో ఆరుగురు మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారని శివధర్ రెడ్డి అన్నారు.లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు దాదాపు అన్ని పోలీసుల నుంచి కొల్లగొట్టినవేనన్నారు,ఆర్మీ, పోలీసులు వద్ద ఉండే ఆయుధాలే వారి వద్ద ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్‌లపై సమాచారం ఇస్తామన్నారు. వారికి గతంలో మిస్సైన ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలిపారు.
ఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్కు సంబంధం లేదు
ఆస్ట్రేలియా బోండీ బీచ్‌లో కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడేనని తెలిపారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చాడని, అయితే ఈ ఉగ్రదాడికి హైదరాబాద్కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 1998లో సాజిద్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిపారు. అక్కడే యురోపియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడని, పెళ్లి అనంతరం మొదటి సారి 1998లో భార్యతో పాటు హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. 2004లో ఓసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి వచ్చాడన్నారు. 2011 జూన్లో ఆస్తుల సెటిల్మెంట్ కోసం మరోసారి వచ్చాడని, 2016 మరో ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం వచ్చాడని ఆయన చెప్పారు. 2022లో తల్లి, సోదరిని చూడటం కోసం వచ్చినట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *