బెట్టింగ్ యాప్‌ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడి గట్టి షాక్

11.14 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ లను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. దర్యాప్తు సమయంలో వారి వాంగ్మూలాలు నమోదు చేసింది.అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన పలు కేసులను ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నది. ఇలాంటి బెట్టింగ్‌ యాప్స్‌ చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు దోహదపడుతాయని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తున్నది.ఈ యాప్‌లో లక్షలాదిమంది వ్యక్తులు, పెట్టుబడిదారులను రూ.కోట్లు మోసం చేశాయని, పెద్ద మొత్తంలో పన్ను ఎగవేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. బెట్టింగ్స్‌ యాప్స్‌కు మద్దతుగా పలువురు ప్రముఖ సినీతారలు, క్రికెటర్లు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ బెట్టింగ్ యాప్ కేసులో నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండలను కూడా తెలంగాణ పోలీసులు విచారించడం జరిగింది. చట్టవిరుద్దంగా నడుస్తున్న ఈ యాప్స్ ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది.ఈ క్రమంలోనే చట్ట విరుద్దమైన బెట్టింగ్ ఫ్లాట్ ఫామ్స్‌పై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *