Recent Posts

కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ , సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ గుడికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్థానాచార్య వి.శివప్రసాద్ ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారిని గౌరవించి, జ్ఞాపికను బహుకరించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

భీమవరం డిఎస్పి జయసూర్య బదిలీ

భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో నూతన డీఎస్పీగా రఘువీర్‌ విష్ణును నియమించారు. పేకాట నిర్వహణ వివాదాల్లో చిక్కుకున్న డీఎస్పీ జయసూర్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే డి.ఎస్.పి జయసూర్య చాలా మంచి అధికారి అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కితాబు ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న ఈ …

Read More »

రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ (షాజహాన్‌పూర్‌) ,ఐఏషియ న్యూస్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పువల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని షాజహాన్‌పూర్‌లో రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ సైకిల్‌ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెదిన ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటర్ వెహికిల్ గేట్ దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. …

Read More »