రోడ్డుపక్కన వానరాల కళేబరాలు: కడప జిల్లాలో దారుణం

కడప,ఐఏషియ న్యూస్: కడప జిల్లాలో దారుణం జరిగింది. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమీపంలో మంగళవారం సాయంత్రం వానరాలను చంపి, వాహనంలో తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్లడం కలకలం రేపింది. పశువులను మేపడానికి వెళ్లిన కాపర్లు రోడ్డు పక్కన 21 వానరాలు చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఈ ఘటనపై బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. కప్పలపల్లి సమీపంలో రహదారిపై వానరాల కళేబరాలు కనిపించాయి. స్థానికులు వానరాల కళేబరాలను పరిశీలించినప్పుడు, వానరాలు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లుగా భావిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *